11-08-2025 12:42:24 AM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేసిన దళిత నాయకుడు కొమ్ము విజయ్ కుమార్
గజ్వేల్, ఆగస్టు 10 : గజ్వేల్ లో ఇటీవల జరిగిన ప్రభుత్వ రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ తన ఆవేదనను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్యకు విన్నవించారు. దళిత సంఘాల అధ్వర్యంలో బాధితుడు కొమ్ము విజయ్ ఆదివారం ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను దళిత సంఘాల నాయకులతో కలిసి తన ఆవేదనను విన్నవించారు.
తన ఎదుగుదల ఓర్వలేకనే తన పై నర్సారెడ్డి దాడి చేశాడని అయనను అరెస్టు చెసి కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పొలీస్ కమిషనర్,గజ్వేల్ ఎసిపిలకు ఫోన్ చేసి విజయ్ పై దాడి పై ఆరా తీశారు. నర్సారెడ్డి పై నమోదైన అట్రాసిటి కేసు విచారణను వేగవంతం చేసి చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, దళిత రత్న అవార్డు గ్రహీత ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత పొన్నాల కుమార్, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముం డ్రాతీ కృష్ణ, నాయకులు పోసాన్ పల్లి రాజు,డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్ పాల్గొన్నారు.