11-08-2025 12:41:10 AM
బాన్సువాడ, ఆగస్టు 10 (విజయ క్రాంతి): పత్తాలాట జోరుగా సాగుతుంది. నిర్మూలన పోలీసులు ఒకవైపు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్న పేకాటరాయలు మాత్రం పేకాటను మానడం లేదు. అడ్డాలుగా చేసుకొని పేకాట ఆడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో దర్జాగా పత్తలాట నిర్వాహన కొనసాగుతుంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వాహకులు ప్రత్యేక సిబ్బంది ద్వారా పేకాటనిర్వాహన నిర్వహిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు.
పేకాట ఆడే వారిని స్వయంగా తమ వాహనాల్లో తీసుకువెళ్లి పేకాట నిర్వా హణ జరిగే స్థలంలో అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ధనార్జన దేంగా నిర్వాహకులు పోటీ పడడం గమనార్హం. అంతేకాదు పేకాట ఆడేవారికి భోజన సదుపాయం మందు చందు అన్ని సౌకల సౌకర్యాలు కల్పిస్తూ జోరుగా పేకాటను నిర్వహిస్తున్నారు.
బాన్సువాడ డివిజన్లోని జుక్కల్, మద్నూర్, పెద్దవడబ్ల్కల్ ,బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ ,బీర్కూర్, నర్సిల్లబాద్, కోటగిరి, వర్ని, మోస్ర ,చందూర్, రుద్రూర్, మండలాల్లో ప్రతినిత్యం ఏదో ఒకచోట పేకాట నిర్వహణ జరుగుతూనే ఉంటుంది. గతంలో రుద్రూర్ మండలంలో అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట నిర్వాహన జరిగి ప్రత్యేక పోలీస్ బృందాల దాడులు చేపట్టి పేకాటపై ఉక్కు పాదం మోపారు.
ఎప్పటికీ తిరిగి ఎదెచ్చగానే పేకాట నిర్వాహన కొనసాగుతుంది. వారిని మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ పక్కనే అటవీ ప్రాంతంలో బిట్ కాయిన్స్ రూపంలో పేకాట నిర్వహణ జోరుగా సాగుతున్న ఆ వైపు పోలీసులు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పేకాట జోరుగానే సాగుతుందని చెప్పుకోవచ్చు.
గత పది రోజుల క్రితమే బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు పార్కు వద్ద ఓ గదిలో బడా వ్యాపారులు పేకాట ఆడుతూ దొరకడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం బాన్సువాడ పట్టణంలోని సరస్వతి ఆలయం వద్ద బడా వ్యాపారస్తులు పేకటాడుతూ ప్రత్యేక పోలీస్ బృందానికి దొరకడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మదన్ హిప్పర్గా, పెద్ద శక్కర్గ, గ్రామాలలో మొత్తం 24 మంది పేకాట ఆడుతూ దొరకడం జరిగింది.
వారి వద్ద నుండి 34 వేల నగదు, 19 సెల్ ఫోన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పేకాట నిర్వాహకులు అడ్డాలను మార్చారు. ప్రస్తుతం బాన్సువాడ డివిజన్ లో అటవీ ప్రాంతాలు, ఫంక్షన్ హాలు, లాడ్జిలు, రైస్ మిల్లుల్లో, జోరుగా పేకాట ఆడుతున్న రనే సమాచారం. దీనిపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని పేకాటడే కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అటవీ ప్రాంతాలు, లాడ్జిలు, రైస్ మిల్స్, ఫంక్షన్ హాల్, అడ్డాలు
బాన్సువాడ డివిజన్ లో పేకాట నిర్వాహకులు అడ్డాలను మార్చారు ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలు పేకాట నిర్వాణపై ఉక్కు పాదం మోపడంతో నిర్వాహ ౯ఏకులు అలర్ట్ అయినారు. ఇప్పుడు అటవీ ప్రాంతాలు లాడ్జిలు రైస్ మిల్స్ ఫంక్షన్ హాల్ లోని గదుల్లోనే జోరుగా పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే పేకాట ఆడే ఆటగాళ్లను అటవీ ప్రాంతంలో తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా వారిని తీసుకువెళ్లి అక్కడే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
కేటి రూపంలో నిర్వాహకులు డబ్బులను వసూలు చేసి వారికి భోజనం మందు ఇతర సౌకర్యాలను కల్పిస్తూ పేకాటను జోరుగానే సాగిస్తున్నారు అంతేకాకుండా ముందుగానే పేకాట నిర్వాహకులు ఆటగాళ్లతో మాట్లాడి ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాలపై పేకాట ఆడే స్థలంలోకి తీసుకువెళ్లి నిర్వాణ కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అంతే కాకుండా పేకాట నిర్వాహకులు ధనార్దమే ధ్యేయంగా కొంతమంది పోలీస్ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ ఈ నిర్వాహ కొనసాగిస్తున్నారని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.
పోలీసులు ఇన్ని దాడులు చేపట్టిన పేకాట మాత్రం ఆగడం లేదు ఎందుకు నిర్వాహకులే పక్కా ప్రణాళికతో పేకాట కొనసాగిస్తున్నారూ. బాన్సువాడ డివిజన్లో ఎక్కడ చూసినా అటవీ ప్రాంతాలనే అద్దాలుగా మారుస్తున్నారు ఇప్పటికైనా అటవీ ప్రాంతాల్లో రైస్ మిల్స్ లాడ్జిలు ఫంక్షన్ హాల్లో పూర్తిగా నిగా పెడితే భారీగానే బడా వ్యాపారవేత్తలు బడా నాయకులు దొరకడం ఖాయమని పలువురు చర్చించుకోవడం విశేషం.
నెలరోజుల నుండి పోలీసులు దాడులు చేసిన ఆగని పేకాట
గత నెల రోజుల నుండి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట నిర్వాణపై దాడులు చేపట్టి వేల సంఖ్యలో నగదు వందల సంఖ్యలో ఆటగాళ్లను సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి అయినప్పటికీ పేకాట నిర్వాహకులు తమ అడ్డాలను మారుస్తూ ఎదెచ్చగానే పేకాట నిర్వాహ చేపడుతున్నట్లు ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి అదేవిధంగా మరికొంతమంది కొంతమంది లోకల్ పోలీస్ సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పేకాట నిర్వహణకు కృషి చేస్తున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి.
పోలీసులు ఎన్ని దాడులు చేపట్టిన పేకాటనిర్వాకులు అడ్డాలు మారుస్తున్నారు తప్ప పేకాటను పూర్తిగా నిషేదించాడకపోవడం చాలా విమర్శలు వినబడుతున్నాయి పేకాట ఆడే వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బడా వ్యాపారవేత్తలు ప్రతిరోజు పేకాట ఆడుతూ లక్షలు రచించడం జరుగుతుందని సమాచారం.ఇప్పటికైనా పేకాట నిర్వాహకులపై ప్రత్యేక నిగా పెట్టి బాన్సువాడ డివిజన్ లో పేకాటను పూర్తిస్థాయిలో నిషేధించే విధంగా పోలీసులు ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకోవాలని పేకాట ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు
బాన్సువాడ పరిసర ప్రాంతాల్లో ఎ క్కడైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ సీఐ మండలి అశోక్ పేర్కొన్నారు. విజయ క్రాంతి పేకాట జోరు పై సిఐ ను వివరణ కోరగా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బృం దాల ద్వారా నిగా పెట్టి పేకాట స్థావరాల పై దాడులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడితే తమ కు సమాచారం అందించాలని వారి పేర్ల ను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.
మండలి అశోక్, పట్టణ సీఐ, బాన్సువాడ