24 August, 2026 | 11:35 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ఔటర్ రైతులకు ఇవ్వరా? X ఔటర్ రైతులకూ ఇస్తాం

22-06-2025 12:30 AM

ఔటర్ రైతులకు ఇవ్వరా?

  1. రైతుభరోసా ఇయ్యకుంటే రింగురోడ్డుపై ధర్నా చేస్తం
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు 
  3. జిన్నారంలో రైతు భరోసాపై ఆందోళన

పటాన్‌చెరు, జూన్ 21: ఔటర్ రింగురో డ్డు పరిధిలోని రైతులకు రైతుభరోసా ఇవ్వకుంటే రింగురోడ్డుపై ధర్నా, వంటావార్పు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారె డ్డి జిల్లా జిన్నారంలో రైతు భరోసాపై శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందో ళన చేపట్టారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీ న్‌పూర్, జిన్నారం మండలాల్లోని 22వేల మంది రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడి రైతులకు రైతు భరోసా ఇవ్వకుంటే రింగు రోడ్డు మీద ధర్నా, వంటావార్పు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.

రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలకు రేవంత్‌రెడ్డి అన్యాయం చేసిండని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలకు రేవంత్‌రెడ్డి కోతలు పెడుతున్నాడని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమాను ఎగవేస్తున్నారని దుయ్యబట్టారు. లగచర్లలో భూములు తీసుకొని రైతులకు బేడీలు వేసి, జైళ్లో పెట్టిండని విమర్శించారు.

గుమ్మడిదల మండలంలోని సర్వేనంబర్ 109 విషయంలో రైతులకు అండగా ఉంటామన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునితా రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ దేవదాసు, వ్యవసాయ శాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డిలకు రైతు భరోసా ఇవ్వాలని వినతిపత్రాలను అందజేశారు. 

ఔటర్ రైతులకూ ఇస్తాం

  1. వెంటనే భూములను గుర్తించి న్యాయం చేస్తాం
  2. పెట్టుబడి సాయంపై బీఆర్‌ఎస్ నేతలది రాద్ధాంతం
  3. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): సాధారణ రైతులతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న రైతులకూ ‘రైతుభరోసా’ అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. వెంటనే ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల సాగులో ఉన్న భూములను గుర్తిస్తామని తెలిపారు. శనివారం రోజు తొమ్మిదెక రాల భూమి ఉన్న రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులు జమ చేశామని వెల్లడిం చారు.

కేవలం ఆరు రోజుల్లో రూ.7,770.83 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేత లు కేవలం రాజకీయ లబ్ధి కోస మే రైతుభరోసాపై అన వసర రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వమని గుర్తించే ప్రజలు, తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టంగట్టారని చెప్పుకొచ్చారు.

రైతుకు గుంట భూమి ఉన్నా తాము రైతుభరోసా చెల్లించి తీరుతామమని తేల్చిచెప్పారు. రైతుల తరఫున ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. తమ పాలనలో ఏ మేరకు రుణమాఫీ చేశారో రైతులకు వివరించాలని సవాల్ విసిరారు. రైతుల ముందుకు వచ్చేందుకు మొహం లేకనే, తమ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆరోపించారు.