15 మంది వ్యాపారులకు షోకాజ్ నోటీసులు జారీ
19-06-2026 12:00 AM
ఉట్నూర్, జూన్ 18( విజయ క్రాంతి ): కారీఫ్ సీజన్లో పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన రసాయన ఎరువులు, యూరియా విక్రయంలో లింకుగా పిచికారి మందులు అంటగడుతున్న 15 మంది వ్యాపారులకు జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశాల మేరకు షోకేస్ నోటీసులు జారీ చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రాథోడ్ తెలిపారు.
ఈనెల 12వ తేదీన ‘ విజయ క్రాంతి‘ దినపత్రికలో ‘ ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ‘ అనే కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. రైతులకు విక్రయించే ఎరువులకు లింకుగా అంటగడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇంద్రవెల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రాథోడ్ 15 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.






