7 April, 2026 | 3:14 PM

Breaking News

ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •   విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి   •   సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి   •  

బీరప్ప ఆలయంలో ఘనంగా శ్రావణమాస బోనాలు

28-07-2025 12:33 AM

మేడిపల్లి,జూలై27: బోడుప్పల్ మున్సిపల్ కార్పోరెషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో కురుమ సంఘం ఆద్వర్యంలో బీరప్ప బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనం ఎత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో ఓగ్గు కళాకారులు డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అనంతరం శ్రావణ మాసంలో కురుమ సంప్రదాయమైన పసరు పిల్లలను అమ్మవారికి సమర్పిం చారు.తెలంగాణ లో సంప్రదాయాలకు పుట్టినిల్లు అని అన్నారు.పిల్లపాపలు చల్లగుండాలని మొ క్కులు తీర్చుకున్నారు.బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు.

కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు.ఈకార్యక్రమంలో పెద్ద కురు మ వాసూరి రాము ,సారి కురుమ సానికె శశికుమార్ ,కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నె దర్మ య్య ,ప్రధాన కార్యదర్శి మరాటి మల్లేష్ , మైల నర్సింహ్మ , జెన్నె రాజు ,బండ బీరప్ప ,జోగు మల్లయ్య ,బెల్లపూరి మధు ,మరాటి మత్య్సగిరి ,కురుమ సంఘం సభ్యులు పాల్గోన్నారు.