28-07-2025 12:32:18 AM
అశ్వారావుపేట, జూలై 27 (విజయ క్రాంతి ) : కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బిజేపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గల శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ (మియా జానీ నగర్)లో భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహా సభలు రెండో రోజు ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజ ల మధ్య చీలికలు తెచ్చి హిందుత్వ ఎజెండాను దేశప్రజలపై బలంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలను మోడినర్కార్ బ్రష్టు పట్టిసోందని, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు స్వతంత్ర ప్రతిపత్తిగల ఎన్నికల సంఘాన్ని సైతం పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వా మ్య లౌకిక వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు లను చంపుతున్నారని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంటున్నారన్నారు. ప్రశ్నించే శక్తులను లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో బిజేపి పనిచేస్తోందని, మేధావులు, కవులు, కళాకారులపై కూడా కత్తి కడు తున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులపై పగపట్టి అణిచి వేయాలనే కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
బిజేపి వల్ల క మ్యూనిస్టులకు కూడా ప్రమాదం పొంచి ఉందని, అయినప్పటికీ దేనికీ భయపడకుండా అమరుల స్పూర్తితో ముందుకు సాగాలని, పేదలు, కర్షకులు, కార్మికుల అభ్యున్నతి కోసం పుట్టిన కమ్యూనిస్టు పార్టీని, ఎర్రజెండాలను అంతమొందించడం ఎవరి తరం కాదని, నేడు ప్రపంచం మొత్తం కమ్యూని స్టుల అవసరాన్ని గుర్తెరుగుతోందని చెప్పారు.
నేడు చట్టసభల్లో అంతా ధనికులు ఉన్నారని, డబ్బులు వెదజల్లి ఓట్లు కొ నుగోలు చేసే విధానానికి బిజేపి ముందజంలో ఉందని, ఎన్నికల్లో ధనాన్ని సమకూర్చే శక్తులైన అదాని, అంబానీలకు దేశ సంపదను కారు చౌకంగా కట్టబెడుతున్నారని, ఆర్థిక అంతరాలను సృష్టిస్తున్న బిజేపి విధానాలు చాలా ప్రమాద మన్నారు. రాజకీయాల్లో కూడా శాస్త్రసాంకేతిక రంగ పోకడలు పెరిగిపోయాయని,
ఏఐ ప్రభావం విద్యావైద్యంతో పాటు తదితర అంశాల్లో ప్రాధాన్యత మరింత పెరిగిందన్నా సోషల్ మీడియా ద్వార బిజేపి వ్యూహాత్యమకంగా ఆబద్ధాలను నిజాలుగా ప్రచా రం చేస్తుందని, అధికార దాహంతో తహతహలాడుతున్న బిజేపి బిహార్ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట సుమారు 60 లక్షల ఓట్లను తొలగించారని, మా హారాష్ట్రలో గెలించేందుకు కొత్త ఓట్లను చేర్చారని, కేంద్ర ఎన్నికల సంఘం సైతం బిజేపీ కనుసన్నల్లో వని చేస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రజలకిచ్చిన హామీలను వూర్తిగా నెలవేర్చాలని చె ప్పారు.
జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఎకరాకు నీరందించాలన్నారు. సమాజ మార్పు యువత వల్లే సాధ్యమని, నేటి యువత రేపటి రాజకీయ భవిష్యత్కు ఎంతైనా అవసరం అన్నారు. పార్టీ వ్రజా సంఘాల నిర్మాణానికి ప్రజలతో మమేకమైన ముందుకు సాగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించాలన్నారు. పార్టీ మండల కార్యదర్శులు, ప్రజాసంఘాల బాధ్యులు చర్చల్లో పాల్గొనగా తీర్మాణాలు ఆమోదించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలో జు అయోధ్య, ముత్యాలవిశ్వనాధం, తో పాటు కల్లూరి వెంకటేశ్వరావు, మున్నా లక్ష్మీ కుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులు స య్యద్. సలీం, ఏపి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి మునీర్, దా రయ్య,
సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య, నరిరెడ్డి పుల్లారెడ్డి, రావులపల్లి రవికుమార్, నరాటి ప్రసాద్ చండ్రా నరేంద్ర, చలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, కమటం వెంకటేశ్వరావు, దుర్గరాశి వెంకన్న, గన్నెని రామకృష్ణ, వివిజయ్, సాయిబాబా పూర్ణచంద్రరావు, కొండలరావు, రాహుల్ హరీష్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.