29 April, 2026 | 1:56 AM

వాహనాలను తనిఖీ చేసిన ఎస్‌ఐ

29-04-2026 12:39 AM

చిన్నంబావి, ఏప్రిల్ 28: మండల కేంద్రంలోని సమీప లక్ష్మీపల్లి స్టేజ్ వద్ద వాహనాలను స్థానిక ఎస్త్స్ర రామన్ గౌడ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను,నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నామని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఎస్త్స్ర హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.