18 June, 2026 | 5:25 PM

Breaking News

వృద్ధాశ్రమంలో అన్నదానం.. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ   •   రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే   •   ఇంటర్మీడియట్ కామర్స్, అకౌంటెన్సీ తెలుగు అకాడమీ పుస్తకాల సహ-రచయితగా డాక్టర్ ఎం మల్లారెడ్డి   •   అనారోగ్యంతో బాధపడుతున్న జంజర్ల సునందకు అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు   •   ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఫార్మసీ డిగ్రీ చదివే సువర్ణావకాశం   •   ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ   •   ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ల కోసం కౌన్సిలింగ్   •   స్మశాన వాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్   •   అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •  

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్ఐ సస్పెన్షన్

18-06-2026 02:41 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్18:  మండల కేంద్రం అర్వపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈట సైదులును గురువారం జిల్లా ఎస్పీ నరసింహ సస్పెండ్ చేశారు.విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా,ఫోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయంపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా పరిగణించి ఈచర్య తీసుకుంటున్నట్లు విశ్వాసనీయ వర్గాలు వెల్లడించాయి.పలు కేసుల్లో ఆధారాలను తారుమారు చేసి అవినీతి,అక్రమాలను నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.