18 June, 2026 | 4:31 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

కేశంపేట్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్

18-06-2026 02:43 PM

షాద్ నగర్ జూన్ 18 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, గురువారం  కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లోని వివిధ విభాగాలను  పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిశుభ్రత, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మరియు సిబ్బంది పనితీరును సమీక్షించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పోలిసులు  ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, మహిళలు మరియు పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన మరియు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని కమిషనర్ గారు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో షాద్‌నగర్ డీసీపీ శిరీష , ఏసీపీ లక్ష్మీనారాయణ , కేశంపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరహరి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.