30 March, 2026 | 3:27 AM

సిద్ధార్థ పాఠశాలల అంతర్గత చదరంగ పోటీలు

30-03-2026 01:49 AM

ముకరంపుర, మార్చి 29 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ సిద్ధార్థ పాఠశాలలో ఆదివారం సిద్ధార్థ పాఠశాలల అంతర్గత చదరంగం పోటీలు నిర్వహించా రు. 80 మంది విద్యార్థులు పాల్గొని వారి మేధాశక్తిని చాటారు. ఈ సందర్భంగా పాఠశాలల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లా డుతూ చదరంగం ఆటతో విద్యార్థులకు మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందని అందుకు చదరంగం క్రీడ నేర్చుకునేటట్టు పిల్లలను చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.

అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బ హుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్, కరీంనగర్ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్త  కార్యద ర్శులు తాటి పెళ్లి సతీష్ బాబు, కంకటి సుజ న్ కుమార్, చీఫ్ ఆర్బిటర్ మార్క అనిల్, కోచ్ లు తరుణ్, అభిరామ్, రేవిక్, పృద్వి, విశాల్, బి .జీవన్, ఆర్, నరేన్  క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.