బాలికలపై లైంగికదాడికి యత్నం
నిర్మల్‌లో తప్పించుకున్న మైనర్లు
పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్
నిర్మల్, మార్చి 29( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ కాలనీ చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై ఓవర్గం యువకులు లైంగికదాడియత్నం చేయడం తీవ్ర కలకలని సృష్టించింది. నిందితులిద్దరూ గంజాయి సేవించి మైనర్ బాలికకూ గంజా యి తాగించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పట్టణ పోలీసులు తెలిపారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం నిర్మల్ సోఫీ నగర్ కాలనీకి చెందిన అ బ్బాస్ ఖాన్, షేక్ కలీంలు ఇద్దరు మైనర్ బా లికలను మభ్యపెట్టి మాయమాటలతో శనివారం పోచంపాడు పార్కుకు తీసుకువెళ్లా రు. బలవంతంగా బాలికలకు గంజాయి సిగరేట్ తాగించారు. మత్తులో ఉండగా లైంగిక దాడికి యత్నించారు. ఒక బాలికపై దాడి చేయగా, మరో బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది. పొద్దుపోయినా బాలికలు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికి, పోలీసులకు సమాచారం ఇచ్చా రు.
అపస్మారక స్థితిలో ఇంటికి వచ్చిన బాలికలు కుటుంబ సభ్యులకు విషయం తెలప డంతో వారు పోలీసులకు సమాచారం అం దజేశారు. విషయం బయటికి పొక్కడంతో వందలాది మంది బాధితుల పక్షాన నిలిచి ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, వెంటనే అరెస్టు చేయాల ని డిమాండ్ చేశారు. పట్టణ పోలీసులు అ బ్బాస్ ఖాన్, షేక్ కలీమ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులిద్దరూ స్థానికంగా ఆటో నడుపుతూ, కూలీ పనులు చేసేవారని, తమను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నామని పోలీ సులు తెలిపారు.
లైంగికదాడికి గురైన బాలికలను పోలీసు బందోబస్తు మధ్య పట్టణం లోని సఖి కేంద్రానికి తరలించారు. లైంగిక దాడి విషయం తెలుసుకున్న ఎస్పీ జానకీ ష ర్మిల, ఎస్పీ సాయికిరణ్, పట్టణ సిఐలు అలర్టయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అలాగే మైనర్ బాలికలు ఇ తరులు చెప్పే మాయమాటలు నమ్మవద్దని పోలీసులు తెలిపారు.




