calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞాన సరస్వతి నగర సంకీర్తనలో సిద్ధార్థ విద్యార్థులు

04-12-2025 12:00:00 AM

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

చొప్పదండి , డిసెంబర్3 (విజయ క్రాంతి):చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం నిర్వహించిన నగర సంకీర్తన లో సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించినారు ఆలయం నుండి నగర సంకీర్తన మొదలై ఎన్టీఆర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా హనుమాన్ దేవాలయం మీదుగా జ్ఞాన సరస్వతి ఆలయానికి పూరవీధుల గుండా చేరింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా వద్ద సిద్ధార్థ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ లక్ష్మీ నవీన్ కుమార్ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ఆలయంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించగా విశేష భక్తులు పాల్గొని స్వీకరించారు సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సరస్వతి నగర సంకీర్తనలు పాల్గొనడం చాలా హర్షనీయమైన విధానమని అన్నారు.

మనకు చొప్పదండిలో జ్ఞాన సరస్వతి ఆలయం ఉండుట వల్ల విద్యార్థులు చాలా అదృష్టవంతులని తెలిపారు ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం వల్ల జ్ఞానం కలిగి విద్యార్థులకు క్రమశిక్షణ ఉత్సాహం ఐక్యమత్యత పెరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు తదితరులుపాల్గొన్నారు