04-12-2025 12:00:00 AM
చొప్పదండి, డిసెంబరు 3 (విజయ క్రాంతి): చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయము తృతీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నగర సంకీర్తన అంగరంగ వైభవంగా నిర్వహించారు. జ్ఞాన సరస్వతి ఆలయం నుండి నగర సంకీర్తన మొదలై ఎన్టీఆర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా హనుమాన్ దేవాలయం మీదుగా జ్ఞాన సరస్వతి ఆలయానికి పురవీధుల గుండా చేరింది.
ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవీన్ కుమార్ లు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు పుల్యాల లక్ష్మారెడ్డి, మండల శాఖ అధ్యక్షులు గుర్రం ఆనంద్ రెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్, తమ్మాడి కనకరాజు, మేడి శంబయ్య, తదితరులుపాల్గొన్నారు.