calender_icon.png 13 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చోరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

13-10-2025 05:22:46 PM

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడిందని కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం అన్నారు. సోమవారం మండలంలోని మోహన్ రావు పేట్, జోగినిపల్లి గ్రామాల్లో ఓటు చోరీకి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఓటు చోరీకి పాల్పడే గెలిచి అధికారంలోకి వచ్చిందనీ ఇందుకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇకనైనా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించి భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని వారి డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీకి మద్దతుగా వ్యవహరించవద్దని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్యాల కిషన్ రావు, సరికెళ్ళ నరేష్,పూదరి నర్సయ్య, జాగర్ల మహేష్, జాగర్ల రాజయ్య, సంద మహేష్, శనిగరపు రాజయ్య, పత్తిపాక రాజు, శనిగరపు వినోద్, గుండవేణి రాజలింగం, జవుడం మల్లేష్, బొడ్డు మహేష్, నల్ల రాజశేఖర్, మంద శంకర్, బీనవేణి గంగాధర్, అడ్లగట్ట రాజేష్, ఉరుమడ్ల నర్సయ్య, జాన సురేష్, తుక్కయ్య గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.