calender_icon.png 13 October, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రస్మా స్టేట్ మెంటర్ అవార్డు స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్

13-10-2025 05:18:05 PM

నిర్మల్: రాష్ట్రస్థాయిలో ప్రత్యేక స్టేట్ మెంటర్ అవార్డును నిర్మల్ కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట ఆడిటోరియంలో నిర్వహించిన ట్రస్మా స్టేట్ మెంటర్స్ అవార్డ్ 2025-26ను స్థానిక వశిష్ఠ హై స్కూల్ చైర్మన్ & ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. ఈ అవార్డును రాష్ట్ర ఉన్నత విద్య మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య ఇటికల పురుషోత్తం చేతుల మీదుగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర ట్రస్మా సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.