19 August, 2026 | 1:02 AM

‘సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట’

19-08-2026 12:12 AM

ఘనంగా అంతర్జాతీయ పోటీలు 

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): అమెరికాలోని చార్లెట్లోని హిల్టన్ చార్లెట్ ఎయిర్పోర్ట్ రిసార్టులో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు మాట్లాట అంతర్జాతీ య పోటీలు ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ రెండు రోజు ల పోటీల్లో అమెరికా, కెనడా నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది ప్రేక్షకులు హాజరయ్యా రు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.

పదరంగం, తిరకాటం, ఒనిమా విభాగాల్లో బుడతలు (57), సిసింద్రీలు (811), చిరుతలు (1216) వయోవర్గాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలు చార్లెట్కు చేరుకుని కుటుంబాలతో కలిసి మూడు రోజులపాటు వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు మాట్లా ట జట్టు నాయకుడు పారుపూడి కిరణ్ మాట్లాడుతూ ఈ ఏడాది దాదాపు 35 నగరాల్లో ఆన్లైన్తో కలిపి సుమారు 3,500 మంది పిల్లలు పాల్గొన్నారని తెలిపారు.

మనబడి ఉపాధ్యక్షు లు శ్రీదేవి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరియా విశ్వవిద్యాలయంలోని తెలుగు కోర్సుల్లో చేరి మాతృభాషకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. రాయవరం విజయ భాస్కర్ బాలచంద్రిక ద్వారా పిల్లలకు తెలుగు రచనల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నామని, 2026 విద్యా సంవత్సరానికి మనబడి తరగతులు సెప్టెంబర్ 12/13 వారాంతంలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్, పసుపుల రవి, తెలుగు మాట్లాట బృం దం, చార్లెట్‌నార్త్ కారోలినా ప్రాంతీయ బృం దాలు, స్వచ్ఛంద సేవకులు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ పాల్గొన్నారు.