19 August, 2026 | 2:59 AM

లక్ష మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మిస్తాం

19-08-2026 12:12 AM

నేటి మంత్రుల సభను విజయవంతం చేయండి....

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో రానున్న రెండు సంవత్సరాలలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలు చేసుకునేందుకుగాను గోదాములు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

మంగళవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరుగు మంత్రుల సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు , అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం నిల్వ లు చేసుకునేందుకు గానుగోదాములనునిర్మిస్తామన్నారు, అలాగే బుధవారం సుల్తానాబాద్ లో 250 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు వస్తున్నారని, ఈ సందర్భంగా జరుగు సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో విజయ రమణారావు వెంట పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య , జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్ తో పాటు కౌన్సిలర్లు, పలువురు అధికారులు , నాయకులు పాల్గొన్నారు,