పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి
కొండాపూర్, ఆగస్టు 18 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మంగళవారం సిఐటియు అనుబంధ యూనియన్ గ్రామ పంచాయతీ కార్మికులు కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో కి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు బాబురావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య లు మాట్లాడుతూ కొండాపూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా పంచాయతీ కార్మికులకు 26000 వేతనం ఇవ్వాలని అన్నారు. కార్మికులకు నష్టం చేసే జీవో నెం 51 మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.
రానున్న రోజుల్లో పంచాయతీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకయ్య, అధ్యక్షులు సంజీవులు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మన్నె రాజు, సహాయ కార్యదర్శి గోపాల్, కిషన్, నాయకులు సుశీల కవిత, సత్యమ్మ, బుచ్చయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు.






