04-12-2025 11:12:46 PM
తహసీల్దార్ శ్రీకాంత్..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): స్థానిక సంస్థల ఎన్నికలు 2025 నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు.గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ ల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులందరూ ఎన్నికల నిబంధనలు పాటించి ప్రశాంత ఎన్నికకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు పాటించనట్లయితే రూ.5లక్షల వరకు జరిమానా విధించి,కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ, సీఐ నాగేశ్వర్ రావు,ఎస్సై సైదులు, ఎంపీఓ గోపి,ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.