calender_icon.png 16 May, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల రజోత్సవ సంబురం

12-05-2025 03:16:09 AM

మహబూబాబాద్, మే 11 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామకృష్ణ విద్యాలయంలో 1999-2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు రజోత్సవ సంబరం నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రజతోత్సవ వేడుకలకు పాతికేళ్ల క్రితం ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో స్థిరపడ్డ వారంతా హాజరయ్యారు.

ఆప్యాయతగా పలకరించుకుంటూ చిన్న నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. పాఠశాల కరస్పాండెంట్ జి.దేవేందర్ ఆధ్వర్యంలో పూర్వపు విద్యార్థులు నాటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని  ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులు కృష్ణమాచారీ, మహేందర్, అలీ, లక్ష్మణ్ లను ఘనంగా సన్మానించారు.