calender_icon.png 16 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఏపీ సెట్ ఫలితాల్లో ఎస్సార్ అకాడమీ విద్యార్థుల ప్రభంజనం

12-05-2025 03:20:22 AM

వరంగల్, మే 11:. టీ జీ ఈఏపీ సెట్ 2025 ఫలితాల్లో ఎస్సార్ విద్య సంస్థలకు చెందిన వి.నాగ సిద్ధార్థ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 32 ర్యాంకు సాధించి రాష్ట్రంలో ఎస్సార్ విజయపథాన్ని ఎగురవేశారు. అదేవిధంగా మేడా కార్తీక్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 234వ ర్యాంకు, జోగు ఆది రామ్ ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 471 ర్యాంకు, ఎం.వినయ్ బైపిసి విభాగంలో 149వ ర్యాంకు, ఎండి బదుళ్లా మొహినుద్దీన్ బైపీసీ విభాగంలో 162 వ ర్యాంకు సాధించి రాష్ట్రంలో ఎస్సార్ విజయ పథాన్ని ఎగురవేశారు.

అలాగే కె అంజన సంతోషి 178వ ర్యాంక్, పి.సాయి దివ్యన్ 183 వ ర్యాంక్, కే.సాయి కిరణ్ 200 వ ర్యాంక్, జి. సాయి హర్షిని 268 వ ర్యాంక్, వై.స్నేహితా రెడ్డి 390 వ ర్యాంక్, కే. ఏంజిల్ 412వ ర్యాంక్, జోగు అభిరామ్ 471 వ ర్యాంక్, వి.ప్రత్యున్నా రెడ్డి 475 వ ర్యాంక్, తోట ప్రణయ 496 ర్యాంక్, మహమ్మద్ షాహిద్ రెహాన్ 513 ర్యాంక్, చల్ల హన్సిక 539 ర్యాంక్ సాధించి మరోసారి ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని చైర్మన్ వరదా రెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలు వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ తమ విద్యాసంస్థల విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరింత అత్యున్నత మైన ర్యాంకులు సాధించిన తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు.

గత 50 సంవత్సరాలుగా పటిష్టమైన ప్రణాళికలతో హై స్కూల్ జూనియర్ కాలేజీ ఎంసెట్ ఐఐటి లో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ 2025 జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు.