హైదరాబాద్ క్రీడాకారిణికి రజత పతకం
జాతీయ డెఫ్ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భావని కెడియా
హైదరాబాద్, మార్చి 30(విజయక్రాం తి) : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన భావని కెడియా, చండీగడ్‌లో ఈ నెల 25, 27 తేదీల మధ్య జరిగిన 27వ నేషనల్ డెఫ్ సీనియర్ స్పోరట్స్ ఛాంపియన్‌షిప్‌లో అ ద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం సా ధించింది. ఫైనల్ పోటీలో భావని అద్భుతం గా పోరాడి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాఫ్రీన్ షైఖ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 7-6, 10/6 సూపర్ టైబ్రేకర్‌లో తృటిలో ఓడి పోయింది.
అయినప్పటికీ, ఆమె పోరాట స్పూర్తి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుం ది. భావని కెడియా ఇప్పటికే అంతర్జాతీ య స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి విశేష గుర్తింపు పొందింది. టోక్యో, బ్రెజిల్‌లో జరిగిన డెఫ్లింపిక్స్‌లో మహిళల డబుల్స్ వి భాగంలో 5వ స్థానం సాధించింది. అలాగే గ్రీస్ మరిటర్కీలో జరిగిన వరల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆమె ప్రతిభను చాటుకుం ది.
ప్రస్తుతం అత్తాపూర్‌కు చెందిన భావని, మాజీ డేవిస్ కప్ క్రీడాకారుడు ఎం. వాసుదేవ రెడ్డి మార్గదర్శకత్వంలో వాల్యూ ల్యాబ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో శిక్షణ పొందుతోంది. క్రమశిక్షణ, కఠోర సాధనతో ఆమె విజయపథంలో ముందుకు సాగుతోంది. ఈ విజయంపై భావని మాట్లాడుతూ, నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సా ధించడం నాకు గర్వకారణం. స్వర్ణాన్ని కో ల్పోయినా, ఇది నాకు మరింత కృషి చేయడానికి, రాబోయే పోటీల్లో మెరుగైన ఫలితా లు సాధించడానికి ప్రేరణనిచ్చింది అని తెలిపారు.




