దళిత క్రిస్టియన్ల హోదాపై తీర్పు విడ్డూరం..
31-03-2026 01:05 AM
ముషీరాబాద్, మార్చి30(విజయక్రాంతి): దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దళిత క్రిస్టియన్ జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జేఏసీ నేతలు గడ్డం అశోక్, జెరూసలేం మత్తయ్య, సంజయ్ ఆనంద్, సునీల్, గౌరీ నగేష్ ,స్వామి దాస్, డేనియల్ తదితరులు మాట్లాడారు.
మార్చి 29న సుప్రీంకోర్టు దళితుల మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కును కాలరాసిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశ పౌరులకు మత స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్ హోదా పోవడం అమానుషమ, ఈ తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.




