12 April, 2026 | 1:46 AM

ఎస్‌బీఐ ఖాతాల నుంచి రూ.2.30 కోట్లు స్వాహా!

12-04-2026 12:25 AM
  1. నల్లగొండ జిల్లా దేవరకొండ బ్రాంచ్ నుంచి జరిగిన ప్రక్రియ
  2. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం
  3. బయటకు పొక్కడంతో పరారీలో నిందితుడు
  4. తర్జన భర్జనలో బ్యాంక్ అధికారులు

సూర్యాపేట/దేవరకొండ, ఏప్రిల్ 11(విజయక్రాంతి): బ్యాంకులోని ఓ కాంట్రాక్ట్ ఉ ద్యోగి అధికారుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు తెలుసుకుని వారికే తెలియకుండా ఇతర బ్రాంచ్ లలో సుప్తావస్థలో ఉన్న ఖాతాల నుంచి రూ.2.30 కోట్లను డ్రా చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ద్వారా జరిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బ్యాంకులో పనిచేసే ఓ కాంట్రాక్టు  ఉద్యోగే ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు స్థానికంగా వినిపిస్తుంది.

చాలా రోజులుగా లావా దేవీలు జర పకుండా ఇతర బ్రాంచ్‌లలో సుప్తావస్థలో ఉన్న అకౌంట్ల నుంచి ఈ డబ్బులను తమ బంధువుల అకౌంట్‌లకు ఆ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబా ద్‌లోని ఓ బ్రాంచ్‌లో ఖాతా కలిగి ఉండి లం డన్‌లో ఉంటున్న ఓ వినియోగదారుడి అ కౌంట్‌లో సుమారు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అతని ఫోన్‌కు బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిగినట్లు మెసేజ్ వెళ్లడంతో అప్రమత్తమైన ఆయన, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి బాగోతం బయటపడింది.

ఈ విషయం బయటపడిందని గ్రహించిన సదరు కాం ట్రాక్ట్ ఉద్యోగి పరారీ అయ్యాడు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ందుకు ఆ బ్యాంకు అధికారులు ఆలోచిస్తున్నట్లు     దీనిపై వివరణ తీసుకునేందుకు బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

అయితే సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి డబ్బులు డ్రా చేసిన అకౌంట్ లు దేవరకొండ బ్రాంచ్ లోవి కాద ని హైదరాబాద్ కు చెందిన శాఖలోనివి అని కొందరు స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఎలా జరిగింది, దీనికి పూర్తి కారకుడు అతనేనా లేక ఇంకా ఎవరైనా సిబ్బంది పాత్ర ఉందా అనే పూర్తి విషయాలను అధికారులు వెల్లడిస్తే కానీ తెలియనున్నాయి.