calender_icon.png 13 January, 2026 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యా! శతకోటి వందనాలు

01-01-2026 12:00:00 AM

హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్‌ను విజయవంతంగా నిర్వహించిన సొసైటీకి ప్రత్యేక అభినందనలు. 11 రోజుల పుస్తకాల పండుగ ఘనంగా నిర్వహించినందుకు, ప్రారంభ, ముగింపు సభలు బ్రహ్మాండంగా చేసినందుకు కృతజ్ఞత లు చెప్పాల్సిందే. అయితే బీసీలు బిచ్చగాళ్లు కావడంతో వారిని ఈ సభలకు పిలిచినా, పిలవకున్నా పెద్దగా ఫరక్ పడదనే నిర్ధారణకు వచ్చినందుకు ప్రత్యే క ధన్యవాదాలు. అంతేకాదు సాహిత్యానికి, పుస్తకాలకు.. బీసీలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పినందుకు కూడా మీకు శతకోటి వందనాలు.

పన్నెం డేండ్ల తెలంగాణ బుక్ ఫెయిర్ చరిత్రలో బీసీలకు స్థానం లేకుండా పుస్తకాల పండుగ ఘనంగా నిర్వహించినందుకు అభినందించాల్సిందే. ఆంధ్ర ఆధిపత్యంలోని కమ్మ, రెడ్ల అధీనంలో, బ్రాహ్మణుల మార్గనిర్దేశంలో నడు స్తున్న బుక్ ఫెయిర్ సొసైటీ దృష్టిలో బీసీలంటే అడుక్కు తినే వాళ్ళు, ఆత్మ గౌరవం లేనివాళ్ళు అని మరోసారి నిర్ధారించారు. మీ విద్వేష, అహంకారపూ రిత ధైర్యానికి అభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నాము. 

అయ్యలారా! ఈ తెలంగాణ సమాజంలో ఒక్క బీసీ సాహితీవేత్త/ మేధావి కూడా లేకుండా 38వ జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు. బుక్ ఫెయిర్ ప్రారంభ, ముగింపు సభల్లో పాల్గొ నేందుకు బీసీల నుంచి ఒక్కరు కూడా అర్హులు లేరని తేల్చి చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు. మీరు ఇంత పద్ధతిగా చెప్పిన తర్వాతైనా మా బీసీలు సోయికి వస్తరనే అనుకుంటున్నా. ఇప్పటికైనా మా బీసీలందరూ సిగ్గు తెచ్చుకొని అగ్రకులాధిపత్యాలపై పోరాడాలని కోరుకుంటున్నా.

అట్లనే బీసీలను వంచించిన బుక్ ఫెయిర్ సొసైటీని వెంటనే రద్దు చేయాలని బీసీ సమాజం తర పున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు బుక్ ఫెయిర్ సొసైటీ బేషరతుగా తెలంగాణ సమా జానికి క్షమాపణలు చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ప్రభుత్వం కట్టుది ట్టమైన చర్యలు తీసుకోవాలి. బుక్ ఫెయి ర్ నిర్వహణ ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో నిర్వహించాలి లేదా ఈ బాధ్యతను సాహిత్య అకాడమీకి అప్పజెప్పాలి. 

డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్