పారదర్శకంగా ‘సర్’
నల్లగొండ టౌన్, జులై 2 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం అయన నల్గొండ పట్టణంలోని పలు కాలనీలలో నిర్వహిస్తున్న సర్ ఓటరు నమోదు ను పరిశీలించారు.
పానగల్ రహదారిలోని అర్బన్ హాస్పిటల్ ఎదురుగా, శ్రీనగర్ కాలనీలలో బిఎల్ ఓ లు ఓటర్ల ఇంటింటికి వెళ్లి సర్ కార్యక్రమం నిర్వహిస్తుండగా కలెక్టర్ సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్స్,వాటిని పూరించి తిరిగి వాపస్ తీసుకోవడం, 6,7,8 ఫారంలన్నీ బిఎల్ ఓ లతోపాటు ఉన్నది లేనిది పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు కిట్ తోపాటు ఐడెంటిటీ కార్డు ఇతర సామాగ్రిని అంతటిని తీసుకు వెళ్తున్న డి లేనిది, బిఎల్‌ఎలు హాజరవుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.బి ఎల్ ఓ లు ఇంటింటికి వచ్చినప్పుడు సరైన సమాచారాన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. సర్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓటరు జాబితాను ప్రదర్శించడం ,తప్పొప్పులు కొత్త ఓటరు నమోదు ,సవరణలు చేసేందుకు ఆ తర్వాత అవకాశం ఉంటుందని తెలిపారు.






