పాఠశాలలను సందర్శించిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్
03-07-2026 01:57 AM
చిట్యాల, జూలై 2: ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు మండలంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ వెలిమినేడు పాఠశాలలను సందర్శిం చి బోధనఅభ్యసన కార్యక్రమాలను పరిశీలించారు.విద్యార్థుల అభ్యసన స్థాయిని సమీక్షిం చిన అధికారులు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని ఉపా ధ్యాయులకు సూచించారు. ప్రీ-ప్రైమరీ తరగతుల్లో ఆటలు, పాటల ద్వారా ఆనందదా యక అభ్యసనాన్ని అమలు చేయాలని, ఉన్న త తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్తో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి విద్యార్థుల ఫలితాలు మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






