5 July, 2026 | 2:24 AM

నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

05-07-2026 12:00 AM

చేవెళ్ల జోన్‌లోఫామ్ హౌస్‌లకు కొత్త భద్రతా మార్గదర్శకాలు: ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి

మొయినాబాద్, జూలై 4 (విజయ క్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల జోన్లో ఉన్న ఫామ్హౌస్లు, రిసారట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో భద్రతను మరింత బలోపేతం చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ఫ్యూచర్ సి టీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశా రు.

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని వుడ్ల్యాండ్స్ రిసార్ట్సో్ల నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశంలో మొయినాబాద్, షంషాబాద్, చేవెళ్ల, షాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 750కు పైగా ఫామ్హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల యజమానులు, నిర్వా హకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఫామ్హౌస్, రిసార్ట్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్ను కనీసం 30 రోజుల పాటు భ ద్రపరచాలని సూచించారు. ్ర అతిథుల వివరాల నమోదు, భద్రతా నిర్వహణ ను సుల భతరం చేసేందుకు ‘SAFE ATITHI‘ డిజిట ల్ యాప్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఫామ్హౌస్ల యజమానులు ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.