10 August, 2026 | 5:01 AM

గ్రామస్థాయి బలోపేతమే కాంగ్రెస్ విజయానికి పునాది

10-08-2026 12:00 AM

రఘునాథగూడెంలో గ్రామ శాఖ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక

కల్లూరు, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నాయకత్వమే ప్రధాన ఆధారం అని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే గ్రామస్థాయిలో బలమైన నాయకత్వం అవసరమని,ఆ దిశగా గ్రామ శాఖ కమిటీల ఏర్పాటు కీలకమని తెలిపారు.సర్పంచ్ కుక్క సుధారాణి రానా, ఉప సర్పంచ్ కర్నాటి కోటేశ్వరి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి దయానంద్ ఆదేశాల మేరకు నిర్వహించబడినట్లు నాయకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కల్లూరు మండలంలోని రఘునాథగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండి జమలయ్య,ప్రధాన కార్యదర్శిగా శీలం నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఖమ్మంపాటి రాము ఎన్నికయ్యారు.అలాగే బీసీ సెల్ అధ్యక్షుడిగా రావుల సీతయ్య,ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జానపాటి రవి,మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎస్కె.మదర్ సాహెబ్,రైతు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రావుల నరసింహారావు,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శీలం సుధాకర్ రెడ్డి,కార్మిక విభాగం అధ్యక్షుడిగా కర్ణాటక వెంకటరెడ్డి,ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పోతురాజు నాగేశ్వరరావు,

బూత్ కమిటీ అధ్యక్షుడిగా పానుగంటి లక్ష్మయ్య, సోషల్ మీడియా అధ్యక్షుడిగా శీలం వీరారెడ్డి లను ఎన్నుకున్నారు.ఎన్నికైన అన్ని అధ్యక్షులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుక్క రానా,సాంబయ్య, సూర్యనారాయణ,కర్నాటి రామకృష్ణారెడ్డి,శీలం రామకృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి,కుడుమల కొండారెడ్డి,కుక్క లాలు శ్రీను,దుర్గాప్రసాద్,పర్సా వెంకటి, బట్టు బాలు, తదితరులు పాల్గొన్నారు.