07-08-2025 12:37:08 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 6 (విజయక్రాంతి); సిరిసిల్ల పట్టణం నటుడు విద్యాసాగర్ కారంపురి. సిరిసిల్ల లో పుట్టి పెరిగి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, హైదరాబాద్ లోని ప్రముఖ వి.ఎఫ్.ఎక్స్ కంపెనీ లో జూనియర్ వి.ఎ ఫ్.ఎక్స్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి అక్కడి నుండి టీం లీడర్ గా అనంతరం సూపర్ వైజర్ గా ప్రమోట్ అయ్యి తనకంటూ ఒక మంచి స్థాయిని సంపాదించుకున్నాడు. అ యినా తనలో ఏదోఒక తీరని వెలితి.చిన్నప్పటినుండి నటుడు అవ్వాలనే తన కలను సా కారం చేసుకోవాలనే ఆశ తనని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది.
తన కల ముందు ఉ ద్యోగం కూడా చిన్నది అయ్యింది. తన కల ను నెరవేర్చుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేసి థియేటర్ ఆరట్స్ లో చేరి కొన్నాళ్లు న టనలో శిక్షణ తీసుకుంటూ వాలి వధ’ పరా యి వంటి పలు నాటక ప్రదర్శనలో నటించాడు. ఆ తరువాత షార్ట్ ఫిలిమ్స్ , సిని మాల్లో అవకాశల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ జెర్సీ, కొత్తపోరడు లో అవకాశా ల్ని అందుకున్నాడు.ఇలా ఒక్కొక్క ప్రయత్నా న్ని, ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కోనసాగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి రూపంలో ప్రపంచంతోపాటు విద్యాసాగర్ నీ కూడా వణికించింది.
అలాం టి పరిస్థితుల్లో పనిలేక, భవిష్యత్తు అర్థం కాక ఊరెళ్లాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్ తర్వాత తనకు తాను గట్టి నిర్ణయం తీస్కొని బలమైన నమ్మకంతో తిరిగి హైదరాబాద్ కు వ చ్చి పంచాయతీ, రామన్న యూత్ సినిమా లు చేస్తున్న సినీప్రయాణంలో ‘బలగం’ సిని మా కొరకు దర్శకుడు వేణు యెల్డండి నుం డి పిలుపు ఒక బలాన్ని, ఒక బలగాన్ని ఇ చ్చింది. ఆ తరువాత వరుసగా భీమదేవరపల్లి బ్రాంచి, సైతాన్ వెబ్ సిరీస్, లగ్గం, సివరపల్లి, కెసిఆర్, కోర్ట్, బద్మాషులు సిని మాల తో వరుసగా తన సినీ ప్రయాణం కోనసాగుతోంది.
బలగం, కోర్ట్, బద్మాషులు సినిమాలలో చేసిన పాత్రలు తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించడమే కాకుండా, తనను నమ్మిన వారికి, తాను నమ్ముకున్న వారికి కూడా ధైర్యాన్ని ఇచ్చింది. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకుంటున్నప్పటికీ తన చిన్ననాటి కల ఏదైతే నటుడిగా గుర్తింపు తె చ్చుకొని తనతో పాటు తాను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రస్తు తం విభిన్న పాత్ర లు పోషిస్తున్నాడు. త్వర లో మారెమ్మ, ఛాం పియన్, అట్లాస్ సైకిల్ చిత్రాలతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు. చివరగా విద్యాసాగర్ మాటల్లో ‘ఈ సినీప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన దర్శకులకు, నిర్మాతలకు, ప్రేక్షకులకు, నా తోటి నటీనటులకు, నా వెన్నంటే ఉన్న నా స్నేహితులకు, నా కుటుంబ సభ్యులకు, నా మార్గ దర్శకులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు’.