calender_icon.png 14 August, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

07-08-2025 12:38:02 AM

కలెక్టర్ భగవత్ సంతోష్ 

నాగర్ కర్నూల్ ఆగస్టు 6 (విజయక్రాంతి) విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ వద్ద మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ బా లికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు.

ఇటీవల కొంతమంది విద్యార్థినులు అ స్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలలో ఆ రోగ్య పరిస్థితులు, ఆహార నాణ్యత, వసతుల పై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. వంటగది, బియ్యాన్ని, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చే శారు. వేడి పదార్థాలే విద్యార్థులకు వడ్డించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని, తప్పిదాలుంటే ఎంత టి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలలోనూ ప్రతిభ గల వి ద్యార్థులు ఉన్నారని, వారికి సరైన దిశానిర్దే శం అందితే సమాజానికి ఆదర్శపాత్రులుగా మారతారని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం బిజినపల్లి మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.