07-09-2025 12:34:45 AM
బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు, సంతోష్‌రావు, ఇతర నాయకులపై జాగృతి అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో రాష్ట్రమంతా ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. జాగృతి పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రాజకీయ పార్టీని ప్రకటించనప్పటికీ జాగృతి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ తరహాలోనే కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే జాగృతిలో పలువురు కార్యకర్తలు చేరుతున్నారు. అయితే జాగృతిలో చేరేవారు బీఆర్‌ఎస్ నుంచి వస్తున్న వారే కదా అని జనాలు అనుకుంటున్నారు. మనోళ్లను మనమే చేర్చుకునుడేందక్క అని నోరెళ్లబెడుతున్నారు. కేసీఆర్ తన దైవం అని చెబుతున్న కవిత, వాళ్ల తండ్రి పార్టీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చేరిక ద్వారా వాళ్ల తండ్రి పార్టీని బలహీనం చేసినట్టు కాదా అని గుసగుసలాడుకుంటున్నారు.
క్రాంతి మల్లాడి