calender_icon.png 8 September, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృత్యువులోనూ వీడని బంధం

07-09-2025 12:36:40 AM

  1. భర్త మరణించిన గంటలోనే భార్య కన్నుమూత 
  2. నాగారంలో హృదయ విదారక ఘటన 

కీసర, సెప్టెంబర్ 6: జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా జీవించారు. సుఖదుఃఖా లను సమానంగా పంచుకున్నారు.. చివరికి మృత్యువులోనూ ఆ బంధాన్ని వీడలేకపోయారు. భర్త మరణించిన గంటకే భార్య కూడా ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన కీసర మండలం నాగారం మున్సి పల్‌లో చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్లితే... నాగారంలోని ప్రశాంత్ నగర్ కాలనీ, రోడ్ నెం.1లో నివాసముంటున్న జంబాపురం నారాయణ రెడ్డి (70), ఆయన భార్య ఇందిర (65) అన్యోన్య దంపతులు. శుక్రవారం నారాయణ రెడ్డి బాత్‌రూమ్‌లో గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి  తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. భర్త ఆకస్మిక మరణాన్ని ఇందిర తట్టుకోలేకపోయింది. ఆయన చనిపోయిన గంట వ్యవధిలోనే ఆమె కూడా కన్నుమూశారు.జీవితాంతం కలిసే జీవించిన ఆ దంపతులు, మరణంలోనూ ఒకరినొకరు వీడకపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. దంపతుల మరణ వార్తతో ప్రశాంత్ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు శోకసం ద్రంలో మునిగిపోయారు. ఒకేసారి ఇద్దరినీ కోల్పోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.