అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
షాద్‌నగర్ చటాన్‌పల్లిలో విషాదకర ఘటన
షాద్‌నగర్, ఆగస్టు 26 (విజయక్రాంతి): షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లిలో బుధవారం విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. చటాన్‌పల్లిలోని ఓ మటన్ షాపులో విద్యుత్ వైరు రిపేరు చేస్తుండగా జమాల్పూర్ నవీన్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్(Electric shock)కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛా యలు అలముకున్నాయి.
కాగా రాఖీ పండు గ సమీపిస్తున్న వేళ అన్నను కోల్పోయిన చెల్లెలు పూజిత చివరిసారిగా తన అన్న నవీ న్ మృతదేహానికి రాఖీ కడుతూ కన్నీటి ప ర్యంతమైంది. అన్నను ఇక ఎప్పటికీ చూడలేనన్న బాధతో కన్నీటి పర్యంతమైన పూజిత రాఖీ కడుతూ రోధిస్తున్న తీరు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.






