పాడేపై తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
27-08-2026 02:36 AM
మహబూబాబాద్ జిల్లా కురవిలో కంటతడి పెట్టించిన ఘటన
మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాఖీ కట్టేందుకు తమ్ముడు ఇక లోకంలో లేకపోవడంతో చివరిసారిగా అతని మృతదేహానికి రాఖీ కడుతూ ఓ అక్క విలవిల్లాడిపోయింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండల కేంద్రంలో మోటపోతుల రమేష్ (36) మృతి చెందాడు. రాఖీ పండుగ స మీపిస్తున్న నేపథ్యంలో రమేష్ అక్క ధనలక్ష్మితీవ్ర ఆవేదన, బాధకు గురైంది. బుధవారం తమ్ముడి అంతిమయాత్రకు హాజరైన ధనలక్ష్మి తమ్ముడి మణికట్టు కు రాఖీ కడుతూ భోరున విలపించింది.






