వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
మేడ్చల్ అర్బన్, మార్చి 27 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోనీ వివిధ కాలనీలలో బస్తీల్లో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు అందరికీ ఆదర్శ మార్గదర్శి లక్షల సంవత్సరాల భారతీయ సంస్కృతి హిందూత్వానికి హిందువుల ఆత్మ రామచంద్ర ప్రభు వ్యక్తి కుటుంబ నిర్వాణకు సకల జనులను మహిళలు వానర పక్షి సంస్థ జాతులను తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూశారని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో మర్యాదలతో హక్కున చేర్చుకొని ఆచరించి ప్రజాహిత పాలన ప్రభుత్వ నిర్వాహనకు దృశ్య శిక్షణకు రాజ్యానివాహనకు ధర్మానికి శ్రీరాముడు అన్ని యుగాలకు ప్రపంచ మానవ జాతికే ఆదర్శమని సుధాకర్ రెడ్డి వెల్లడించారు.అనంతరం సైబరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో గల గౌడవెల్లి మున్సిపల్ పట్టణంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం శ్రీ రామానుజ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు చీర్ల దయానంద్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పురోహితులు కుంతీపురం లక్ష్మీనరసింహ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలను సింగిరెడ్డి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు.అదేవిధంగా శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ విశేషాలను వివరిస్తూ ఆలయ అర్చకులు వివాహ తంతును కొనసాగించారు.
గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ మున్సిపల్ పట్టణంలో శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ కార్పొరేషన్ సర్కిల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో గల శ్రీ సీతారాముల ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహించారు.శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు రాఘవేందర్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా.తాళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా.నరేందర్ లతో పాటు సింగిరెడ్డి నవీన్ చందర్ రెడ్డి.గోమారం రమణారెడ్డి.సింగిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి.శైలేందర్ రెడ్డి.సీనియర్ రెడ్డి వంశీధర్ రెడ్డి.ఆలయ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి.ఉపాధ్యక్షులు శ్రీరాములు యాదవ్.నరేంద్ర చారి.ప్రధాన కార్యదర్శి గోమారం సుదర్శన్ రెడ్డి.కోశాధికారి గోమారం శ్రీనివాస్ రెడ్డి.గువ్వ రవి ముదిరాజ్.రాజగోపాల్ రెడ్డి లతో పాటు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.




