13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వైభవంగా సీతారాముల కల్యాణం

28-03-2026 02:06 AM

సింగం భాను ఆధ్వరంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): భారతీయ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాతృశక్తి విభాగంలో సింగం భాను ఆధ్వర్యంలో మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముడి దివ్య ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు స్వప్న సహా సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సింగం భాను, స్వప్న తెలిపారు.