13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

28-03-2026 02:04 AM

హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణదే వాలయంలో  (హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్) శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పుణ్యదినాన, ఆల యంలోని రాధా గోవిందులు, సీతారామచంద్రుల దివ్య రూపంలో దర్శనమిచారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు, సువాసనగల, అద్భుతమైన ఆభరణాలతో అలంక రించబడి భక్తులను మంత్రముగ్ధులను చేశా రు. ఉదయం కార్యక్రమాలు సంప్రదాయ సీతారామ కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యాయి.

వేద మంత్రోచ్ఛారణలు, మధుర మైన భజనలు, హృద్యమైన కీర్తనల మధ్య ఈ దివ్య వివాహ మహోత్సవం శాంతి, సం పద, సర్వలోక క్షేమం కోసం నిర్వహించారు. సాయంత్రం మహా పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ పరిసరాలు హరినామ సంకీర్తనలతో మారుమోగగా, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (ఎంటెక్, ఐఐ టీ) ప్రత్యేక ప్రవచనం ఇచ్చారు.

ఆయన సీతారామచంద్రుల లీలలు, మహిమలను సులభంగా వివరించి, భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానా న్ని పంచారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం లో ఆయన ఉపన్యాసం విశేషంగా ఉపయోగపడింది. ధర్మంఅంటే నీతి, కర్తవ్యబోధ, ఇంద్రియ ని యంత్రణ శ్రీరాముని జీవితంలో పరిపూర్ణంగా ప్రతిఫలించిందన్నా రు. ఆయన పాలనను రామ రా జ్యంగా కీర్తిస్తారని, ఆ రాజ్యంలో ప్రజలను తండ్రిలా ప్రేమిస్తూ, కష్టాలు లేకుండా, అన్యాయం లేకుండా పరిపాలించారని వివరించారు.

ఈ రోజుల్లో కూడా శ్రీరాముని ఆదర్శాలను అనుసరిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా సమాజం ఆదర్శ స్థితికి చేరుకోగలదని తెలిపారు. కాగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నర్సింగిలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్లో కూడా నిర్వహించబడ్డాయి. వేలాదిమంది భక్తులకు ప్రసాద విందును అందించారు. ఆలయ అధికారులు భక్తులందరికీ సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా సమగ్ర ఏర్పాట్లు చేశారు.