14-02-2026 01:14:40 AM
కోదాడ, ఫిబ్రవరి 13: కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ చైర్మన్ కొప్పుల సుబ్బారెడ్డి పద్మ, వైస్ చైర్మన్ అన్నెం నరసింహారెడ్డి స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు.
అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి తులశమ్మ కన్నారెడ్డి, కొండపల్లి వెంకట శేషగిరిరావు, ఉప సర్పంచ్ బెల్లంకొండ సీతయ్య, అన్నెం పాపిరెడ్డి, అన్నెం చిన్న వెంకటరెడ్డి, కొప్పుల కోటిరెడ్డి, అన్నెం అంజిరెడ్డి, అన్నెం చిన్న వెంకటరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రామయ్య, సత్యనారాయణ రెడ్డి, తదితర గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.