13 April, 2026 | 4:18 PM

Breaking News

ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •  

అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

14-02-2026 01:11 AM

మునుగోడు,ఫిబ్రవరి 13 : లేవీ లో అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడు ప్రాంతంలోని ఒక మిల్లుకు నోటీసు అందజేసి మాట్లాడారు.

లేవీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.లేవీ బియ్యం సేకరణ, నిల్వ , సరఫరా ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఏ విధమైన అక్రమాలు గమనించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.