13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కమణీయం సీత రాముల కళ్యాణం

27-03-2026 03:14 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిదిలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం రాముని బండ ఆలయం లో శ్రీరామ నవమి పురస్కరించుకొని  సీత రాములా కళ్యాణం గ్రామ సర్పంచ్ రజితఅశోక్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారి కళ్యాణం తిలకించి పులకించిపోయారు. స్వామి వారికీకొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.కోరిన కోరికలు తీర్చే కోదండ రామయ్య నామం తో రాముని బండ క్షేత్రం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి, వార్డు సభ్యులు,ఆలయ దాతలు, అర్చకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.