05-08-2025 08:19:52 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యారంగ బలోపేతం దిశగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు చేరువలో పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరమ్మత్తులు అవసరం కలిగిన పాఠశాల భవనాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. రామ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమైనందున, స్థానిక విద్యార్థులకు విద్యను అందించేందుకు నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.