05-08-2025 08:15:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల అవసరాలను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సల పేరుతో మోసం చేస్తున్నాయని వారిపై చర్య తీసుకోవాలని పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులను కలిసి సంతాన సౌఫల్యం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఫిర్యాదు చేశారు. పరీక్షల పేరుతో అమాయక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వైద్య ఫీజులు చేస్తున్నారని ఇబ్బందులను పాటించడం లేదని వారు ఫిర్యాదులు పేర్కొన్నారు అనంతరం ఏవో కు వినతిపత్రం అందించారు.