ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లాలి

28-04-2024 12:50:14 AM

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ

సిద్దిపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తు న్న ఆరు గ్యారంటీలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సూచించారు. శనివారం సిరిసిల్ల వెళ్తున్న క్రమంలో సిద్దిపేట నాగులబండ వద్ద దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు పీసీ విశ్వనాథ్, కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రొటోకాల్ సంబంధాల సలహాదారులు వేణు గోపాల్‌కు  సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణాధ్యక్షుడు ఇమామ్, బొమ్మల యాదగిరి, దాస అంజన్న, పూజల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.