మిగిలింది శ్మశానమే..
n అదీ పంచుకునేందుకు వీల్లేదు
n భూముల అమ్మకం డబ్బు తీసుకోవచ్చు
n ముల్క్ వారసుల కేసులో హైకోర్టు వ్యాఖ్య
n 90 ఏండ్ల భూవివాదంపై చారిత్రక తీర్పు
హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 ఏండ్ల నాటి వివాదంలో హైకోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. 1935 నాటి వివాదం హైకోర్టుకు 1951లో చేరింది. భూవివాదంపై సుదీర్ఘ వాదనలు కొన‘సాగి’ంచిన తర్వాత ఇటీవల తీర్పు వెలువరించి, అత్యంత పాత కేసును పరిష్కరించింది. న్యాయ చరిత్ర పుటల్లోకి ఎక్కిన కేసుగా పరిగణించే సుదీర్ఘకాలం నాటి కేసు ఇది. నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల మధ్య వివాదానికి చెందిన సివిల్ సూట్ సీఎస్ 9/1/1951ను పరిష్కరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. హైదరాబాద్లో నడిగడ్డలోని అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, ఎర్రమంజిల్ వంటి ప్రదేశాల్లోని భూముల వివాదంలో పిటిషనర్లకు ఏమీ లభించలేదు.
ఆయా భూములను ఏనాడో ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగంలోకి తెచ్చింది. చివరికి అమీర్‌పేటలోని శ్మశానం మాత్రమే మిగిలింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నందున దానిని కూడా పిటిషనర్లు పంచుకునేందుకు హక్కు లేదని తేల్చింది. ఇప్పటికే ఈ భూముల వివాదం నిమిత్తం హైకోర్టులో జమ చేసిన రూ.1.82 కోట్లను జాతీయ బ్యాంక్‌లో జమ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ వాటా క్లెయిమ్ చేసుకొని వారు ఆ డిపాజిట్ నుంచి వడ్డీతో పొందేందుకు అర్హులని తీర్పులో పేర్కొంది. భూవివాద కేసు ఇద్దరు ఫిర్యాదుదారులు, 26 మంది ప్రతివాదులు ఉంటే.. వాళ్లు, ఆ తర్వాత తరం సైతం వాళ్లు మరణించడంతో తీర్పు వెలువడే నాటికి వాళ్ల వాళ్ల వారసులు ఫిర్యాదుదారులు అవ్వగా 94 మంది దాకా ప్రతివాదులు అయ్యారు.
౧౯౩౫లో వివాదం మొదలు
నవాబ్ ఫక్రుల్ ముల్క్ చెందిన వారసత్వ భూపంపిణీపై 1935లో వివాదం ఏర్పడింది. నవాబ్ ఫక్రుల్ ముల్క్ 1936లో మరణించడంతో 7వ నిజాం అతని జాగీరు భూమి రక్షణకు కమిటీ వేశారు. నిజాం స్టేట్ భారతదేశంలో విలీనం తర్వాత ఆ కమిటీ కొనసాగింది. దీనిపై 1951లో ముగ్గురు రాజీ పిటిషన్లు దాఖలు చేయడంతో డిక్రీ అయ్యింది. అయిదు భాగాలుగా తొమ్మిది ఆస్తులను నవాబ్ ఘాజీ జంగ్ బహదూర్, నవాబ్ ఫకర్ జంగ్ బహదూర్, నవాబ్ రాయ్ శ్యార్ జంగ్ బహదూర్, నవాబ్ రాయిస్ జంగ్ బహదూర్, నవాబ్ షా నవాజ్ జంగ్ బహదూర్లకు పంపిణీ చేయాలని తెలిపింది. ఎరమ్రంజిల్ తోపాటు పక్కన ఉన్న 21 ఎకరాలు (నాటి విలువ రూ.10.20 లక్షలు), ఎరమ్రంజిల్ పక్కన 75.27 ఎకరాల భూమి (విలువ రూ.7.50 లక్షలు), ఎరగ్రడ్డలోని ఎర్రం నుమా బంగ్లా (విలువ రూ.3.72 లక్షలు), బొల్లారంలోని బంగ్లాతోపాటు 14 ఎకరాల భూమి (విలువ రూ.1.09 లక్షలు), బల్దాలోని దేవిడి (విలువ రూ.1.18 లక్షలు), బల్దాలోని దేవిడి పక్కన ఉన్న భూమి (విలువ రూ.78 వేలు), బెహూలాఖాన్గూడలో భూమి (విలువ రూ.2 వేలు), యూసఫ్‌గూడలో భూమి (విలువ రూ. 2వేలు) మూసాపేటలో భూమి (విలువ రూ.4 వేలు)లను ఐదు భాగాలుగా పంచుకోవాలని డిక్రీ ఇచ్చింది.
ఈ వివాదం హైకోర్టుకు చేరింది. 2022లో రిసీవర్ కమ్ కమిషనర్‌గా రిటైర్డు జిల్లా జడ్జి మహమ్మద్ నిజాముద్దీన్‌ను హైకోర్టు నియమించింది. వాదనలు, ప్రతివాదనలు, వాయిదాల తర్వాత 2023 మార్చి 16న తుది నివేదికను రిసీవర్ హైకోర్టుకు అందజేశారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించాక వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వివిధ అవసరాలకు వినియోగిస్తుంది. నిజానికి పంపిణీ చేయడానికి క్షేత్రస్థాయిలో అమీర్‌పేటలోని శ్మశాన భూమి మాత్రమే ఉన్నదని రిసీవర్ నివేదిక పేర్కొందని గుర్తుచేసింది. తుది డిక్రీ నాటికి కేసులేమీ లేవని, భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బు హైకోర్టు వద్ద ఉందని చెప్పింది. అమీర్‌పేట శ్మశానవాటికను చారిత్రక ప్రదేశంగా కేంద్ర ్ంర గుర్తించిన కారణంగా ముల్క్ వారసులు ఒక కమిటీ వేసి దాని రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిని పంపకం చేసుకునేందుకు వీల్లేదని స్పష్టంచేసింది.






