calender_icon.png 3 August, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపట్లలో ఘోర విషాదం.. ఆరుగురు కార్మికులు మృతి

03-08-2025 01:13:37 PM

బాపట్ల: బాపట్ల జిల్లా(Bapatla District)లోని బల్లికురవాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో బండరాళ్ళు మీద పడి ఆరుగురు కార్మికులు మరణించారు. క్వారీలో పదహారు మంది కార్మికులు పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్ళు మీద పడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో, ఆరుగురు కార్మికులు బండరాళ్ళ కింద నలిగిపోయారని, మృతులందరూ ఒడిశాకు చెందిన కార్మికులుగా అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరికొందరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.