03-08-2025 02:18:37 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు స్వామీ రాజ్ ప్రతిరోజు ఉదయం, ఆదివారం విద్యార్థులకు వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకోజు భాస్కర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. కాగా చదువులలో, క్రీడల్లో ముందుండేలా చర్యలు చేపట్టారు.
అందులో భాగంగానే పాఠశాల సమయంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం, ఆదివారాలు కూడా విద్యార్థిని విద్యార్థులకు క్రీడల్లో ఉపాధ్యాయ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు తీసుకున్న తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సంతోషంగా ఉందని మెరుగైన విద్యను అందిస్తున్నారని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.