03-08-2025 02:17:01 PM
వలిగొండ (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివారం ఎరుకుల హక్కుల పోరాట సమితి 29 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుకల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు ఉండాడి ఆంజనేయులు(Mandal President Undadi Anjaneyulu) జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎరుకల హక్కుల సాధన కోసం ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సమావేశానికి అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బొలుగులు నరసింహ, ఉండాడి కృష్ణ, పత్యపు లక్ష్మయ్య, నరసింహ, కుమార్, శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.