03-08-2025 03:15:58 PM
రామగుండం: రామగుండం నియోజకవర్గంలోని అంతర్గంలో రామగుండం ఎత్తిపోతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరాన్ని మంథని నియోజకవర్గ పరిధిలో కట్టారని, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. రూ. లక్ష కోట్లను గత ప్రభుత్వం వృథా చేసిందన్నారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకపోయిన రికార్డు స్థాయిలో వరి పంట పండిందన్నారు. బనకచర్ల విషయంలో లోకేష్ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నమని అన్నారు.
రాష్ట్రం నుంచి ప్రతిపాదన ఇవ్వటం వల్లనే కేంద్రం బనకచర్లను వ్యతిరేకించిందని, తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని ఇప్పటికే పలుమార్లు చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టానికి బనకచర్ల వ్యతిరేకం అని, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకోస్తామని, ఇచ్ఛంపల్లి వద్ద కట్టాలని గతంలో నిర్ణయం జరిగిందని.. దాన్ని అమలు చేస్తామని అన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటితో పాటు కొత్త ప్రాజెక్టులను గోదావరిపై కడతామని మంత్రి తెలిపారు.