నైపుణ్య శిక్షణ తరగతులు..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల(Telangana Social Welfare Gurukul Vidyalayas) సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ కె. రమా కళ్యాణి(Principal K. Rama Kalyani) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పది, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, హెచ్, ఆర్ సంబంధిత విషయాల్లో స్కిల్స్, ఇంటర్వ్యూ అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జూన్ మూడో వారం నుంచి నైపుణ్య శిక్షణ ప్రారంభమవుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని శిక్షణ పోందగలరని ప్రిన్సిపల్ తెలియజేశారు.






